Share News

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం

ABN , Publish Date - Nov 18 , 2025 | 09:24 AM

భాగ్యనగరంలోని ప్రముఖ హోటల్స్ యజమానుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.

IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం
IT Raids

హైదరాబాద్, నవంబర్ 18: నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతోంది. ప్రముఖ హోటళ్ల చైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్‌పై ఐటీ సోదాలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్ , మేహిఫెల్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ హోటల్స్‌ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.


రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవులు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్ ఓనర్ మజీద్ నివాసంలో ఆరు బృందాలు సోదాలు జరుపుతున్నాయి. పిస్తా హౌస్‌లో పనిచేసే వర్కర్ల ఇళ్లల్లోనూ, వర్కర్లకు కల్పించిన వసతి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. వారికి సంబంధించిన ఫోన్లు, కంప్యూటర్లను ఐటీ అధికారులు చెక్ చేశారు. ఫోన్లలో, కంప్యూటర్లో ఉన్న డేటాను ఐటీ శాఖకు సంబంధించిన హ్యాకర్లు విశ్లేషిస్తున్నారు. అయితే పిస్తా హౌస్ అకౌంటెంట్ మాత్రం అందుబాటులోకి రాని పరిస్థితి. బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో వర్కర్ల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్ కి సంబంధించిన హార్డ్ డిస్కులు, కీలక పత్రాన్ని సీజ్ చేశారు. అంతే కాకుండా వర్కర్ల నుంచి ఐటీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. కాగా.. సుమారు 600 మంది పైగా ఐటీ అధికారులు 30 బృందాలుగా ఏర్పడి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు.


అలాగే షేక్‌పేట్‌లోని మేహిఫిల్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 15 హోటల్స్‌ను మేహిఫిల్ నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈక్రమంలో మేహిఫిల్ రెస్టారెంట్స్ రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆదాయ , వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు. వాస్తవాదాయానికి రికార్డుల్లో చూపించిన ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారుల సోదాల్లో బయపడింది.


ఇవి కూడా చదవండి...

ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు

కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 10:59 AM