MP Etala Rajender: కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:37 AM
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.
సికింద్రాబాద్: కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) అభిప్రాయపడ్డారు. గెలిచినా, ఓడినా, అధికారంలో ఉన్నా, లేకపోయినా దశాబ్దాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని అభివర్ణించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. సికింద్రాబాద్ గాయత్రి గార్డెన్స్(Secunderabad Gayatri Gardens)లో సోమవారం కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలు బాణుక నర్మదతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికల కార్యాచరణ ప్రారంభించాయన్నారు.
బీజేపీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లనే జూబ్లీహిల్స్‌లో ఓడిపోయామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు, చీరలు పంపిణీ చేసి అధికార ధుర్వినియోగానికి పాల్పడి గెలించిందన్నారు. బిహార్‌లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమన్నారు. నగరంలో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని, డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రెండు పడకల ఇళ్లను అర్హులకు కేటాయించాలన్నారు. పేదల ఇళ్లను కూల్చొద్దని హైడ్రాను కోరారు.
నగరంలో బస్తీలు, కొత్తగా ఏర్పడిన కాలనీల్లో పరిస్థితి దుర్భరంగా ఉందని, తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి మంత్రులు రెండేళ్లలో ఒక్క రివ్వ్యూ కూడా నిర్వహించలేదని ఆరోపించారు. తాను స్వయంగా మంత్రి శ్రీధర్‌బాబు ఇంటికి వెళ్లి రైల్వే, స్థానిక సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చానని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో తాగునీటి కనెక్షన్లు, లిఫ్టులు లేవన్నారు.

నగరంలో గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలని ఈటల డిమాండ్ చేశారు. రూ.450 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరి స్తే, అక్కడికి వెళ్లిడానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు వేయడం లేదన్నారు. ఉచిత బస్సు పథకానికి తాను వ్యతిరేకం కాదన్నారు. ఆటో డ్రైవర్లపై రాస్తున్న చలాన్లను ఆపాలని డిమాండ్ చేశారు. తాను రెండు రోజుల క్రితం ఒక పెళ్లికి వెళితే సీఎం వస్తున్నారని 35 నిమిషాలు ట్రాఫిక్‌ను ఆపారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు బీఎన్ శ్రీనివాస్, మల్లారెడ్డి, అజయ్‌కుమార్‌గౌడ్, రాకేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News