Home » Eetala Rajender
ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో బీజేపీ కేంద్ర హై కమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని ఎంపీ ధర్మపురి అరవింద్ సూచించారు. రాజాసింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని.. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని.. రిజైన్ చేశారని గుర్తుచేశారు. రాజాసింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్‌షిప్ తీసుకోవచ్చని ఎంపీ అరవింద్ సూచించారు.
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్.. సాక్షాత్తూ
కమలదళంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది.
మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని.. వీరుడు ఎక్కడా భయపడడని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలు పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటల చెప్పుకొచ్చారు.
గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్ కాదు ప్రమోషన్ శాఖగా ఎక్సైజ్ శాఖ మారిందని ఎక్సైజ్ శాఖ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎంపీ ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ స్టేట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశారు. నీచ రాజకీయాల తాము చేయబోమని తేల్చిచెప్పారు ఈటల రాజేందర్.
నగరంలోని గుల్జార్‌హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17మంది చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలన్నారు.
హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లొస్తున్నాయని, దీంతో కాలనీలో ప్రజలు ఉండలేని స్థితి వచ్చిందని భారతీయ జనతా పార్టీ నాయకుడు వడ్డెపల్లి రాజేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ... హైడ్రా అధికారుల తీరుతో ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు.
Mahesh Kumar Goud: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.