Share News

Weather Report: ఐఎండీ వార్నింగ్.. ఆ జిల్లాల్లో భారీ వర్షం..

ABN , Publish Date - Apr 20 , 2025 | 08:12 PM

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.

Weather Report: ఐఎండీ వార్నింగ్.. ఆ జిల్లాల్లో భారీ వర్షం..
Hyderabad IMD

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు భారీ సూచన జారీ చేశారు. పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగతంలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ జిల్లాల్లో భారీ వర్షం..

వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం.. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. రానున్న మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో మొస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.

పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ దంచికొట్టగా.. సాయంత్రం అయ్యే సరికి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు నేల కూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 20 , 2025 | 08:12 PM