iBomma Case: వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:44 AM
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లతో తన సామాజ్రాన్ని రవి ఏర్పాటు చేసుకున్నారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Imaddi Ravi) కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు (Hyderabad Cyber Crime Police) దూకుడు పెంచారు. ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైల్లో సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గెట్టింగ్ అప్, ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీలకు సీఈవోగా ఉన్నారు రవి. తన టీంతో కలిసి యూకే నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేస్తున్నారు. ముంబైలో ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే రవి తన భార్యతో విడిపోయారు. కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టాలో నివాసం ఉంటున్నారు.
వివిధ వీపీఎన్‌లతో పలు లొకేషన్లు మారుస్తూ.. వెబ్‌సైట్‌లో సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. పైరసీ సినిమాల అప్‌లోడ్ కోసం వందకు పైగా వెబ్‌సైట్‌లు కొనుగోలు చేశారు. పైరసీ బయటపడి ఒక వెబ్‌సైట్ తొలగించినా.. మరో వెబ్‌సైట్‌ను వాడుకుంటూ సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్‌లలో రెండువేలకు పైగా సినిమాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. పైరసీ నెట్‌వర్క్‌ను ప్రపంచ స్థాయిలో విస్తరించారు. కూకట్‌పల్లిలోని ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్స్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. ఇప్పటికే రవిపై 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..
షాకింగ్ .. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లు బంద్..
Read Latest Telangana News and National News