Share News

Guruvareddy On HCA scam: ఆ క్లబ్‌లో అందరూ దొంగలే.. ఎవరున్నా బయటపెడతా..

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:55 PM

Guruvareddy On HCA scam: ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు. ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ ఎలా ఇతనిని పోటీ చేయించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రావు అనహర్హుడని వ్యాఖ్యలు చేశారు.

Guruvareddy On HCA scam: ఆ క్లబ్‌లో అందరూ దొంగలే.. ఎవరున్నా బయటపెడతా..
Guruvareddy On HCA scam

హైదరాబాద్, జులై 11: హెచ్‌సీఏలో (HCA) గతంలో ఉన్నట్టు ప్రస్తుతం లేదని.. అలా ఉంటే ప్రతీ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటకి వస్తాడని తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి గురువారెడ్డి (Telangana Cricket Association Secretary Guruva Reddy) అన్నారు. ఈరోజు (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితం అయిందన్నారు. హెచ్‌సీఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ ప్రతీ సంవత్సరం హెచ్‌సీఏకు రూ.100 కోట్ల వరకు ఇస్తుందని ఆయన వెల్లడించారు. దాదాపు ఇప్పటి వరకు రూ.170 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. విజిలెన్స్ వారు విచారణ చేయడం.. తర్వాత సీఐడీ ఎంటర్ అవ్వడంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందని గురువారెడ్డి అన్నారు. ఎలక్షన్ కమిషన్ సంపత్ కుమార్ ఎలా ఇతనిని పోటీ చేయించారని ప్రశ్నించారు. జగన్మోహన్ రావు అనహర్హుడని వ్యాఖ్యలు చేశారు. క్లబ్‌లో ఉన్నవారు ఎందుకు సహకరించారని నిలదీశారు. బీసీసీఐ ఇచ్చే గ్రాంట్‌ను గ్రౌండ్‌ల అభివృద్ధికి, క్రీడాకారులకు ఉపయోగించాలి కానీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వర రావు చెప్పిన వివరాల ప్రకారం అంతకు ముందు నేర చరిత్ర ఉన్నవాళ్ళని కూడా విచారించాలని డిమాండ్ చేశారు. ఏ క్లబ్ కూడా సొంతంగా నడపట్లేదని స్పష్టం చేశారు.


గురువారెడ్డి ఇంకా ఏమన్నారంటే..

‘క్లబ్‌లలో ఉన్న 217 మంది సభ్యులు అందరూ దొంగలే. పబ్లిక్‌కు సంబంధించిన కోట్ల రూపాయలు ఎలా వాడుకున్నారు. దీని వెనక రాజకీయ నాయకులు ఎవరున్నా అన్నీ బయట పెడతాను. క్యాంటీన్‌ను కూడా ఎవరికి ఇచ్చారు? ఎంత నిధులు తిన్నారు అనే వివరాలు అన్నీ ఉన్నాయి. చాలా మంది దొంగలు ఇందులో ఉన్నారు. జగన్మోహన్ నీకు క్రికెట్ అంటే తెలుసా? ఎందుకు ఎలా ఎన్నికయ్యావు’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రికెటర్లకు గత పది సంవత్సరాలుగా గుర్తింపు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో క్రికెట్‌కు గుర్తింపు వచ్చే వరకు పోరాడుతామని గురువా రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

నా రాజీనామా అందుకోసం కాదు.. రాజాసింగ్ ట్వీట్

నైజీరియన్ యువతులతో డ్రగ్స్ దందా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 11 , 2025 | 05:16 PM