GHMC Worker Assault: షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:12 AM
ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 1: ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ప్రతీరోజు ఏదో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యా ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కామాంధులకు బలవుతున్నారు. కొందరు అత్యాచారాలు చేస్తుంటే.. మరికొందరు నీచులు అత్యాచారం చేయడంతో పాటు మహిళలను దారుణంగా హత్యలు చేస్తున్నారు. అసలు మహిళలు ఒంటరిగా కనబడితే చాలు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నగరంలోని బోరబండ పోలీస్స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జీహెచ్ఏంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిన్న (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీరోజు లాగే బాధితురాలు తన విధులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఓ వ్యక్తి ఆమెను బలవంతం చేశాడు. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కార్మికురాలిపై రాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనపై బాధిత మహిళ బోరబండ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో రాజు.. పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడు మోడల్ కాలనీలో ఓ అపార్టెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నట్టు సమచారం.
ఇవి కూడా చదవండి...
దారుణం.. రోడ్డుపై నగ్నంగా మొండెంతో మహిళ మృతదేహం
పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
Read Latest Telangana News And Telugu News