CM Revanth Reddy: మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ABN , Publish Date - Feb 24 , 2025 | 10:04 AM
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC Eection Campaign)లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్ (Nizamabad), ఆదిలాబాద్ (Adilabad), కరీంనగర్ (Karimnagar), మెదక్ (Medak) ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేంద్రరెడ్డి (Narendra Reddy) తరఫున ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ సభలో మాట్లాడతారు.
ఈ వార్త కూడా చదవండి..
గతంలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలోఉన్నా జీవన్ రెడ్డి గెలిచారు. ఈ సారి పార్టీ అధికారంలో ఉన్నందున సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచితీరాలని ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సభలకు పట్టభధ్రులు భారీగా తరలి రావాలని టీపీసీసీ పిలుపిచ్చింది.
కాగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున స్వయంగా ప్రచారం చేపట్టనున్నారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా మూడు జిల్లాలు పర్యటించి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11.30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుని అక్కడి ప్రచార సభలో పాల్గొననున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని అక్కడి ప్రచార సభలో మాట్లాడతారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఈ మూడు జిల్లాల్లో సభలను ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ గెలుపు కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం దిగనుండటంతో ఎన్నిక రసవత్తరంగా మారింది.
కాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రచారానికి రావాలని కాంగ్రెస్ నేతులు బెదిరిస్తున్నారని.. బెదిరిస్తే ఓట్లు పడతాయా అంటూ ప్రశ్నించారు. కాగా ఎన్నికల ప్రచారం గడువు మంగళవారంతో ముగుస్తుంది. 27న ఎన్నికలు జరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ కీలక ఆదేశాలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News