Share News

Telangana MPs: తెలంగాణ ఎంపీలు టాప్

ABN , Publish Date - Apr 17 , 2025 | 10:00 PM

Telangana MPs: లోక్ సభ ఎంపీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీ చాలా విషయాల్లో టాప్‌లో నిలిచారు. నూటికి నూరు శాతం హాజరుతో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ అగ్రస్థానంలో నిలిస్తే.. లోక్ సభలో అత్యధిక ప్రశ్నలు అడిగి మల్కాజ్‌గిరి ఎంపీ తొలి స్థానంలో నిలిచారు.

Telangana MPs: తెలంగాణ ఎంపీలు టాప్

న్యూఢిల్లీ, ఏప్రిల్17: లోక్‌సభలో ప్రశ్నలు అడగడంతోపాటు పార్లమెంట్‌కు హాజరైన వారిలో తెలంగాణ ఎంపీలు దేశంలోనే టాప్‌లో నిలిచారు. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడంలో మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటెల రాజేందర్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక పార్లమెంట్ సమావేశాలకు రెగ్యులర్‌గా హాజరు కావడంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు. ఆయన నూటిని నూరు శాతం హాజరయ్యారు. ఇక హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ 21 చర్చల్లో పాల్గొని అగ్రస్థానంలో ఉన్నారు.

  • లోక్‌సభ సమావేశాల్లో ఈటల రాజేందర్ 80 ప్రశ్నలు అడిగారు. ఆయన 9 చర్చల్లో పాల్గొన్నారు. ఇక ఆయన హాజరు 91.17 శాతం ఉంది.

  • కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి 100% హాజరుతో ఈ సమావేశాల్లో టాప్‌లో నిలిచారు. 79 ప్రశ్నలు అడిగిన ఆయన.. 17 చర్చల్లో పాల్గొన్నారు.

  • 95 శాతం హాజరుతో బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 18 ప్రశ్నలు అడగడంతో పాటు ఆరు చర్చల్లో ఆయన పాల్గొన్నారు.

  • 2024 జూన్ 24 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ వరకు 18వ లోక్ సభ నాలుగో సెషన్‌లో ఎంపీల హాజరు.. ప్రశ్నలు.. చర్చలు ప్రైవేట్ నెంబర్ బిల్లుల గురించి పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది.

  • ఇక మూడు అంశాల్లో కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి చివరి స్థానంలో నిలిచారు.

  • అలాగే కేంద్ర మంత్రులకు సంబంధించిన గణాంకాలు అందుబాటులో ఉంచ లేదు. దీంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లోక్ సభ హాజరు శాతం, ప్రశ్నలు, చర్చలు ప్రైవేట్ మెంబర్ బిల్లుల డేటాను పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేయలేదు.


  • డీకే అరుణ హాజరు శాతం 88.23 ఉండగా.. 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు.

  • ధర్మపురి అరవింద్ హాజరు శాతం 88.23 ఉండగా..59 ప్రశ్నలు అడిగారు. రెండు చర్చల్లో పాల్గొన్నారు.

  • సురేష్ షెట్కర్ హాజరు శాతం 86.76% ఉండగా.. 62 ప్రశ్నలు అడిగారు. 5 చర్చల్లో పాల్గొన్నారు.

  • కొండ విశ్వేశ్వర్ రెడ్డి 95.58 శాతం హాజరు ఉండగా.. 18 ప్రశ్నలు అడిగారు. 6 చర్చల్లో పాల్గొన్నారు

  • మల్లు రవి 92.64% హాజరు శాతం ఉండగా.. 54 ప్రశ్నలు అడిగారు. 21 చర్చల్లో పాల్గొన్నారు.


  • రఘురామ్ రెడ్డి 85.29 శాతం హాజరు ఉంది. 56 ప్రశ్నలు అడిగారు. 9 చర్చల్లో పాల్గొన్నారు

  • అసదుద్దీన్ ఓవైసీ 92.64 శాతం హాజరు ఉంది. 54 ప్రశ్నలు అడిగారు. 21 చర్చల్లో పాల్గొని టాప్‌లో నిలిచారు.

  • బలరాం నాయక్ 72. 05 శాతం హాజరు ఉంది. 13 ప్రశ్నలు అడిగారు. 3 చర్చలో పాల్గొన్నారు

  • రఘునందన్ రావు 97.05 హాజరు ఉంది. 46 ప్రశ్నలు అడిగారు. 7 చర్చల్లో పాల్గొన్నారు.


  • గూడెం నగేష్ 92.6 నాలుగు శాతం హాజరు ఉంది. 40 ప్రశ్నలు అడిగారు. 4 చర్చల్లో పాల్గొన్నారు

  • గడ్డం వంశీ కృష్ణ 89.70 శాతం హాజరు ఉంది. 31 ప్రశ్నలు అడిగారు. ఏడు చర్చల్లో పాల్గొన్నారు.

  • కడియం కావ్య 83.82 శాతం హాజరు ఉంది. 31 ప్రశ్నలు అడిగారు. 5 చర్చల్లో పాల్గొన్నారు.

  • కుందురు రఘువీర్ రెడ్డి 72.05% హాజరు ఉండగా.. ఎనిమిది ప్రశ్నలు అడిగారు. ఒక్క చర్చల్లోను ఆయన పాల్గొన లేదు

17 మంది ఎంపీల్లో హాజరు శాతం ప్రశ్నలు చర్చలు అడగడంలో వెనుకంజలో ఉంది ఒక్క ఒక్క ఎంపీ, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి

ఇవి కూడా చదవండి..

CM ChandraBabu: గుడ్ ఫ్రైడే వేళ.. పాస్టర్లకు గుడ్ న్యూస్

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Betel Leaves with Fenugreek:తమలపాకులతో కలిపి మెంతులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..!

Updated Date - Apr 17 , 2025 | 10:00 PM