Car accident: అర్ధరాత్రి కారు బీభత్సం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:45 PM
Car accident: వేగంగా దూసుకొచ్చిప ఓ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి ఎక్కేసింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌తో పాటు రెండు చెట్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

హైదరాబాద్, మార్చి 3: నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద ఓ కారు బీభత్సం (Car Accident) సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కింది. అయితే రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంసమయ్యాయి. గత అర్ధరాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఫుట్‌పాత్‌పై ఉన్న కారును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా వాహనం ఎవరిది అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది అని పోలీసులు భావిస్తున్నారు. అయితే కారు 120 కిలోమీటర్ల స్పీడు పైగానే కారు వచ్చి డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డివైడర్‌ను కారు ఢీకొన్న దృశ్యాలను చూసి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరైనా ఉండి ఉంటే ఎంతటి ఘోరం జరిగేదని చర్చించుకుంటున్నారు.
Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు
రెండు భారీ చెట్టు ధ్వంసమయ్యాయంటే కారు ఎంత వేగంగా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చని జనాలు చెప్పుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కారు నడిపిన వ్యక్తిని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణామా.. లేక మద్యం మత్తులో వాహనం నడిపాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు నిర్ధారణకు వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ధ్వంసమైన కారును పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి...
Parcel explosion: లారీ నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..
Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి
Read Latest Telangana News And Telugu News