Share News

Azharuddin Vs Kishan Reddy: నేను దేశ ద్రోహినా?.. కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:54 AM

దేశ గొప్పతనాన్ని ప్రపంపచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని మంత్రి అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.

Azharuddin Vs Kishan Reddy: నేను దేశ ద్రోహినా?.. కిషన్ రెడ్డిపై మంత్రి అజారుద్దీన్ సీరియస్
Azharuddin Vs Kishan Reddy

హైదరాబాద్, నవంబర్ 1: తనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin) స్పందించారు. శనివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మంత్రి మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదంటూ వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి తన స్థాయి తగ్గించుకోలేనని చెప్పుకొచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. దేశ గొప్పతనాన్ని ప్రపంపచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.


మంత్రిగా జూబ్లీహిల్స్‌లో అడుగుపెట్టిన తనను ప్రజలు ఆదరించారని.. ఇందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విమర్శించిన వాళ్ళకి సమాధానం చెప్పదల్చుకోలేదని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు.


కాగా.. అజారుద్దీన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అజారుద్దీన్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని, భారత్‌కు చెడ్డపేరు తెచ్చారని విమర్శించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానకరమన్నారు. అజారుద్దీన్ దేశ గౌరవానికి భంగం కలిగించారంటూ కిషన్‌ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి...

పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 12:13 PM