Share News

ACB Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Apr 26 , 2025 | 08:41 AM

ACB Raids: హైదరాబాద్‌లో ఏకకాలంలో ఏసీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర షోషించిన మాజీ ఈఎన్సీ హరీరామ్ నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

ACB Raids: తెలంగాణలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ACB Raids

హైదరాబాద్: తెలంగాణలో ఏసీబీ అధికారులు ఇవాళ(శనివారం) ఏకకాలంలో రైడ్స్ చేయడం సంచలనంగా మారింది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. ఏక కాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం డిజైన్‌లో హరీరామ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హారీరామ్ విచారణకు హాజరయ్యారు.


కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని ఎన్టీఎస్ఏ రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌‌లో అనేక లోటుపాట్లు ఉన్నాయని రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యవహారించిన అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఖండిస్తునే ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న(శుక్రవారం) మీడియాలో ఈ ప్రాజెక్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌లో అవినీతి చేసిన వారిని వదలబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈక్రమంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


ఈ వార్తలు కూాడా చదవండి...

Kaleshwaram: తుమ్మిడిహెట్టి నిర్మాణం 3 బ్యారేజీలు పునర్నిర్మాణం

Mahabubabad: మానుకోటలో ఏసీబీ దాడులు

CM Revanth Reddy: పీవోకేను భారత్‌లో కలిపేయండి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 26 , 2025 | 09:02 AM