Phone Tapping Case: విచారణకు హాజరు.. షాక్‌లో ఆరా మస్తాన్
ABN , Publish Date - Jul 02 , 2025 | 09:21 PM
పోలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ సైతం ట్యాప్ అయింది. దీంతో విచారణ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.

హైదరాబాద్, జులై 02: తెలంగాణలో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ సైతం ట్యాప్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో అతడిని సైతం దర్యాప్తు అధికారులు బుధవారం కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో.. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆరా మస్తాన్ మాట్లాడిన ఫోన్ కాల్స్‌ను దర్యాప్తు అధికారులు వినిపించారు. వీటిని విన్న ఆరా మస్తాన్ షాక్‌కు గురైనట్లు తెలుస్తుంది.
2023 నవంబర్‌లో అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డితోపాటు చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఆరా మస్తాన్ పలు సందర్భాల్లో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో మాట్లాడిన కాల్స్‌ను ప్రభాకర్ రావు టీమ్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇక 2023 సెప్టెంబర్ నుండి ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ అయినట్లు ఈ దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలాగే ఏపీకి చెందిన పలువురు పొలిటికల్ లీడర్లు, వారి అనుచరులతో సైతం ఆరా మస్తాన్ మాట్లాడిన ఫోన్ కాల్స్‌ను ప్రభాకర్ రావు టీమ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
2020 నుంచి ఆరా మస్తాన్ ఫోన్‌ను ఈ టీమ్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు. దీంతో బుధవారం ఆరా మస్తాన్‌ను సిట్ అధికారుల బృందం దాదాపు రెండు గంటలపాటు విచారణ చేసింది. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను సైతం దర్యాప్తు అధికారులు రికార్డు చేశారు. ట్యాప్ అయిన కాల్స్, ఆడియోలు చూసి దర్యాప్తు అధికారుల ఎదుటే ఆరా మస్తాన్ నిర్ఘాంత పోయినట్లు సమాచారం.
ఆరా మస్తాన్ ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ అయిన వందలాది కాల్స్ ట్యాప్ చేసి రికార్డ్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. ఈ విచారణలో ఆడియోలు, ట్యాప్ అయిన డేటాను చూపించి ఆరా మస్తాన్ స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు బృందం రికార్డ్ చేసింది. అలాగే తెలంగాణ ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆరా మస్తాన్ మాట్లాడిన ఫోన్ కాల్స్ మొత్తం ప్రణీత్ రావు రికార్డ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
సిగాచి పేలుడుపై కమిటీ ఏర్పాటు.. నివేదికకు గడువు విధించిన సర్కార్
ఐపీఎస్‌కి రాజీనామా.. ఎందుకంటే..
Read Latest Telangana News And Telugu News