Metro Trains: మండే ఎండ.. మెట్రో అండ
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:01 AM
ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలామంది మైట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువశాతం మంది మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తుండడంతో ఓపక్క రద్దీ ఏర్పడుతుండగా ఆదాయం కూడా సమకూరుతోంది.

- చల్లటి ప్రయాణం అందిస్తున్న రైళ్లు
- అధిక సంఖ్యలో ఆశ్రయిస్తున్న నగరవాసులు
- మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10.30 వరకు విపరీతమైన రద్దీ
- 5 లక్షలకు దగ్గరగా ప్రయాణికులు
హైదరాబాద్ సిటీ: ఎండల నేపథ్యంలో మెట్రోరైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రతీ బోగీలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్లపై ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏసీ సౌకర్యం అంతగా లేకపోవడంతో మెట్రోలో చల్లటి ప్రయాణానికి నగరవాసులు ప్రాధాన్యమిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఓదేల-2లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలి
5 లక్షలకు చేరువలో..
రూ.50 వరకు టికెట్ చార్జీతో ఏసీలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉండడంతో చాలామంది మెట్రో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10.30 వరకు ఎల్‌బీనగర్ - మియాపూర్(LB Nagar - Miyapur), నాగోలు - రాయదుర్గం కారిడార్లలో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. జేబీఎస్ - ఎంజీబీఎస్ కారిడార్‌లో కూడా సాధారణ రోజుల్లో కంటే రెండింతల మంది అధికంగా ప్రయాణిస్తున్నట్లు మెట్రో వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులుగా 5 లక్షల మంది మార్కు దగ్గరగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటోందని మెట్రో సిబ్బంది చెబుతున్నారు.
నాలుగు రోజులుగా మెట్రోలో
ప్రయాణికుల సంఖ్య (లక్షల్లో)
తేదీ సంఖ్య
ఏప్రిల్-22 4.75
ఏప్రిల్-23 4.84
ఏప్రిల్-24 4.90
ఏప్రిల్-25 4.92
ఈ వార్తలు కూడా చదవండి
ఆన్‌లైన్‌లో అవకాడోలు బుక్ చేస్తే.. రూ.2.60 లక్షలు స్వాహా
మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
Read Latest Telangana News and National News