HRC action Srushti case: 'సృష్టి' వ్యవహారంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్..
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:36 AM
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అమ్మతనాన్ని అంగడి సరకుగా మారుస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అరాచకాలపై మానవ హక్కుల కమిషన్(HRC) సీరియస్ అయింది. ఈ కేసును సుమోటోగా స్వీకరిస్తూ.. ఆగస్టు 28లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డాక్టర్ నమ్రత సహా ఇప్పటివరకూ 8 మందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం నిందితులకు మారేడుపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా, నిందితులను కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమ బాగోతాలపై ఇప్పటికే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించింది. 2016లోనే TGMC డాక్టర్ నమ్రత మెడికల్ లైసెన్స్ ఐదేళ్లపాటు రద్దుచేసింది. 2021లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నందున అంగీకరించారు. అయినప్పటికీ వేరే డాక్టర్ల లైసెన్సుల ద్వారా డాక్టర్ నమ్రత ప్రాక్టీసు కొనసాగిస్తూనే ఉన్నారు. సికింద్రాబాద్‌లో అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతూ అక్రమంగా వీర్యం, అండాలను సేకరిస్తూ భారీ దందాకు పాల్పడుతున్నారు. అలాగే, సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని ఆశించే దంపతులకు వేరే వాళ్లకు పుట్టిన పిల్లలను కట్టబెడుతూ.. చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పంపిణీకి సిద్ధంగా కొత్త రేషన్‌కార్డులు..
సరికొత్త రూపంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్
Read Latest Telangana News and National News