Telangana Panchayat Elections: ఆ జిల్లాలో పంచాయతీ ఎన్నికపై హైకోర్టు స్టే..
ABN , Publish Date - Nov 27 , 2025 | 08:59 PM
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ ..
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
మహబూబ్ పట్నంలో మూడు ఎస్టీ కుటుంబాలకు చెందిన ఏడుగురు ఓటర్లు ఉన్నారు. వీరికి సర్పంచ్‌తో పాటు మూడు వార్డులు కూడా కేటాయించారు. ఈ రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన యాకూబ్, శ్రీకాంతాచారి, లింగయ్య, విజయ్, వెంకటమల్లు, పోలు నాగయ్య తదితరులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. గతంలో మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ నుంచి తండాలను వేరు చేసి కొత్త జీపీలు ఏర్పాటు చేశారని, దీంతో ఆ గ్రామంలో 576 ఓట్లు ఉన్నట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. 199 మంది ఎస్సీలు, 358 మంది బీసీలు, 13 మంది ఓసీలు, ఏడుగురు ఎస్టీలు ఓటు హక్కును కలిగి ఉన్నారని చెప్పారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు దక్కాయి. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
కిష్టాపురం గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామ సర్పంచ్‌గా కొండం రంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్‌తో పాటు 8 మంది వార్డ్ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండం రంగారెడ్డి బ్రదర్స్ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఏకమై పార్టీలకతీతంగా సర్పంచ్‌గా రంగారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇవి కూడా చదవండి:
దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ