Share News

Malla Reddy: పాల స్కూటర్‌పై మల్లారెడ్డి హల్‌చల్.. గతాన్ని గుర్తుచేసుకొని..

ABN , Publish Date - Feb 21 , 2025 | 06:05 PM

BRS: మాజీ మంత్రి మల్లారెడ్డి పవర్‌ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. రాజకీయాలతో పాటు నిజ జీవితానికి సంబంధించి శక్తిమంతమైన డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకోవడంలో ఆయన పెట్టింది పేరు.

Malla Reddy: పాల స్కూటర్‌పై మల్లారెడ్డి హల్‌చల్.. గతాన్ని గుర్తుచేసుకొని..
Malla Reddy

మల్లారెడ్డి.. ఈ పేరు వింటే వెంటనే కొన్ని పవర్‌ఫుల్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. ‘పాలు అమ్మినా, పూలు అమ్మినా’.. అందులో బాగా వినిపించే డైలాగ్. తెలంగాణ యాసలో పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా.. సక్సెస్ అయ్యా అంటూ ఈ మాజీ మంత్రి చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది. అప్పట్లో యూత్‌ను ఈ మాస్ డైలాగ్ ఒక ఊపు ఊపేసింది. యువతకు ఒక్కసారిగా ఐకాన్‌గా మారారు మల్లారెడ్డి. అలాంటి డైలాగ్‌ను ఆయన నిజం చేశారు. పాల డబ్బా స్కూటర్‌తో ఆయన సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


స్కూటర్ చూడగానే..!

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోమారు హల్‌చల్ చేశారు. పాల స్కూటర్‌తో ఆయన సందడి చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పలో‌ ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు పాల డబ్బాతో ఉన్న స్కూటర్ కనిపించింది. దీంతో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయో ఏమో గానీ వెంటనే దాని మీదకు ఎక్కి సందడి చేశారు. స్కూటర్ నడుపుతూ పలువురు కార్యకర్తలు, ప్రజలతో ఫొటోలు దిగారు. ఆ తర్వాత స్కూటర్‌పై పాలు అమ్ముతున్న వ్యాపారిని శాలువాతో సన్మానించారు మల్లారెడ్డి. ఆయన స్కూటర్ నడపడం, వ్యాపారిని సన్మానించడం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, స్కూటర్‌పై పాలు అమ్మే స్థాయి నుంచి తన కష్టంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు మల్లారెడ్డి. ఎన్నో విద్యా సంస్థలు స్థాపించడమే గాక వ్యాపారాలతో ఈ రేంజ్‌కు చేరుకున్నారాయన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు.


ఇవీ చదవండి:

రంగరాజన్‌పై దాడి కేసు.. కోర్టుకు వీరరాఘవరెడ్డి

ఆర్థికాభివృద్ధే మహిళా సమాఖ్య లక్ష్యం

అవినీతికి పెద్దపీట వేశారు.. సీఎం రేవంత్‌పై కిషన్‌రెడ్డి ఫైర్

మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2025 | 06:17 PM