Home » Mallareddy
మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. దీంతో రెవెన్యూ అధికారులు అధికారికంగా భూ సర్వే చేపట్టడంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి దివాళి వేడుకను ఘనంగా చేసుకున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఇంటి బయట టపాసులు పేలుస్తూ మల్లారెడ్డి ఉత్సాహంగా గడిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా డీజే టిల్లు పాటకు దుమ్ము రేపే స్టెప్స్ వేసి అదరగొట్టారు.
సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను బాగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల సందర్శనలో పేర్కొన్నారు. గతంలో పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదని, రివర్స్ అయ్యిందన్నారు.
రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌పై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాటమార్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు పెడతానని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నానని..
రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని... తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలో మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి కుమారుడు సీహెచ్ భద్రారెడ్డి రాజభవనంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించినట్లు వదంతులు వచ్చాయి. మల్లారెడ్డి హాస్పిటల్స్, సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఐటీ అధికారులు ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రచారం జరిగింది.
గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్ కాదు ప్రమోషన్ శాఖగా ఎక్సైజ్ శాఖ మారిందని ఎక్సైజ్ శాఖ దిశ కమిటీ చైర్మన్, ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
MLA Marri Rajasekhar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.