Share News

MP Etala Rajender: ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్‌ కాదు.. ప్రమోషన్‌ శాఖ

ABN , Publish Date - Jul 19 , 2025 | 08:00 AM

గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్‌ కాదు ప్రమోషన్‌ శాఖగా ఎక్సైజ్‌ శాఖ మారిందని ఎక్సైజ్‌ శాఖ దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

MP Etala Rajender: ఎంపీ ఈటల సంచలన కామెంట్స్.. ప్రొహిబిషన్‌ కాదు.. ప్రమోషన్‌ శాఖ

- ఎక్సైజ్‌ శాఖ దిశ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌

- ఎక్సైజ్‌ శాఖ ఇలా తయారైందని చురకలు

సికింద్రాబాద్: గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిచిగా గంజాయి, మద్యం విక్రయిస్తున్నారని, యువత పెడధోరణి పడుతున్నారని.. ప్రొహిబిషన్‌ కాదు ప్రమోషన్‌ శాఖగా ఎక్సైజ్‌ శాఖ మారిందని ఎక్సైజ్‌ శాఖ దిశ కమిటీ చైర్మన్‌, ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) మండిపడ్డారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశాన్ని కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అధ్యక్షతన నిర్వహించారు.


సమావేశంలో మెంబర్‌ సెక్రటరీ, కలెక్టర్‌ మనుచౌదరితో పాటు కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలును, పురోగతిని సమీక్షించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ అధికారులు చేసే పనుల ద్వారా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనే వ్యత్యాసం చూపకుండా ప్రజలకు సత్ఫలితాలు చేకూరేలా చూడాలన్నారు.

city3.jpg


ఓడిపోతే బాగుండేది: ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని, మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తనకు ప్రస్తుతం కనీస గౌరవం దక్కడం లేదని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. అధికారులు ప్రోటోకాల్‌ కూడా పాటించడం లేదని, ఓడిపోతే బాగుండేది ఇంట్లో కూర్చుండేవాడినన్నారు.


అధికారులు సహకరించడం లేదు: మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే

మల్కాజిగిరి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

భూ కబ్జాలు ఎక్కువయ్యాయి: లక్ష్మారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే

ఉప్పల్‌ నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. అలాగే జిల్లా విద్యాధికారి కిషన్‌ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఐఓ కిషన్‌ టూ మచ్‌ చేస్తున్నాడని మల్కాజిగిరి లోని కార్యాలయంను ఖాళీ చేయమంటే చేయడం లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 08:00 AM