Eggs: గుడ్డు ధర వెరీ బ్యాడ్...
ABN , Publish Date - Nov 20 , 2025 | 10:03 AM
గుడ్డు ధర కొండెక్కింది. సామాన్యులకు అందుబాటులో ఉండే గుడ్డు ప్రస్తుతం కొండెక్కి కూర్చుంది. ఒక్కె గుడ్డును రూ. 8కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులకు ఒకింత భారంగానే మారిందని చెప్పవచ్చు. ఇక.. కూరగాయన పరిస్థితి కూడా అలాగే ఉంది. వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయింది.
- అతివృష్టితో పెరిగిన కూరగాయల ధరలు
ఉట్నూర్(ఆదిలాబాద్): గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ గుడ్డు ధర ఉన్నట్టు ఉండి అమాంతంగా పెరిగి పోతుండడంతో చికెన్ ధరలకు చేరుకుంటుంది. జిల్లాలో కోడిగుడ్డు రిటైల్ ధర గత కొన్ని రోజుల కింద రూ.5 నుంచి రూ.6.50 వరకు ఉండగా ప్రస్థుతం మార్కెట్‌లో గుడ్డు ధర రూ.8కి చేరిపోయింది.

సామాన్యుల దుస్థితి..
గత వర్షాకాలంలో కనివిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. కురిసిన అతివృష్టితో కూరగాయలు అంతంత మాత్రమే అందుబాటులోకి వస్తుండడంతో కూరగాయ ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో టమోటా రూ.50కాగా వంకాయలు కిలో రూ.120, బీరకాయలు రూ.100, దొండకాయలు కిలో రూ.80, సోరకోయలు ఒక్కొటి రూ.30 నుంచి రూ.50కి, ఆకుకూరలు ఒక కట్ట రూ.20 నుంచి రూ. 30కి విక్రయిస్తున్నారు. కూరగాయల ధరలతో సమానంగా కోడిగుడ్డు ధర పెరగడంతో సామాన్యుల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. శాకాహారం తినాలన్న ఆకాంక్షను తగ్గించుకోవడంతో పాటు గుడ్డు ధర కూడా పెరిగి పోవడంతో చికెన్ కొనుక్కుంటే మేలని ప్రజలు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News