మావోయిస్టులపై నిరంతర నిఘా: డీజీపీ
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:58 AM
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు.

మహబూబ్‌నగర్, జనవరి17(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉందని డీజీపీ జితేందర్ చెప్పారు. తెలంగాణ, ఛత్తీ్‌సఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి మావోయిస్టు ల చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం లేదన్నారు.
శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని పోలీసు కార్యాలయంలో మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో కర్ణాటక, ఛత్తీ్‌సఘడ్ పోలీసులతో కలిసి నేరస్తులకోసం గాలిస్తున్నామన్నారు. పాత పోలీస్ స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించామని, త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు.