Share News

కిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్‌లపై జర జాగ్రత్త..

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:38 AM

అక్రమ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ ప్రజలకు సూచించారు.

కిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్‌లపై జర జాగ్రత్త..

  • సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (ఆంధ్రజ్యోతి): అక్రమ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి స్కీమ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికా గోయల్‌ ప్రజలకు సూచించారు. సైబర్‌ నేరగాళ్లు అధిక లాభాల ఆశజూపి ఫేక్‌ ఎక్స్ఛేంజ్‌లు, పోంజీ స్కీములు, ఫిషింగ్‌ దాడుల ద్వారా మోసం చేస్తున్నారన్నారు. ఏ సంస్థ కూడా ఊహకందని స్థాయిలో అధిక లాభాలు ఇవ్వలేదని, పరిమిత కాల ఆఫర్ల ప్రకటనలు అసలు నమ్మొద్దని సూచించారు.


సోషల్‌మీడియా, బ్యాంకు ఖాతాలకు సంబంధించి మరింత భద్రతను కల్పించే టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఇవ్వాలని, అపరిచిత లింకులను క్లిక్‌ చేయవద్దని తెలిపారు. సైబర్‌ నేరాల బాఽధితులు 1930 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

Updated Date - Feb 02 , 2025 | 03:38 AM