Share News

MLA: కాంగ్రెస్‏లో కమిట్‌మెంట్‌ ఉండదు.. పనిచేసే వారికి పదవులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 09:48 AM

కాంగ్రెస్ పార్టీలో కమిట్‌మెంట్‌ ఉండదని, పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

MLA: కాంగ్రెస్‏లో కమిట్‌మెంట్‌ ఉండదు.. పనిచేసే వారికి పదవులు

- ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కమిట్‌మెంట్‌ ఉండదని, పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Danam Nagender) అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఓల్ట్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


city5.2.jpg

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు న్యాయం జరిగిందని, రాహుల్‌(Rahul) ఆశయాలను సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గ్రేటర్‌ ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా మంత్రి పదవులు స్వీకరించిన వారికి దానం అభినందనలు తెలియచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 11 , 2025 | 09:48 AM