Telangana Panchayat Elections: ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు.. కారణమిదే..
ABN , Publish Date - Nov 27 , 2025 | 09:45 PM
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ లీగల్ సెల్‌ను..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ఈ లీగల్ సెల్‌ను ముగ్గురు సూపరిండెంట్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాలు చేస్తూ కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో లీగల్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తిచేసే విధంగా, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లాలతో లీగల్ సెల్ సమన్వయం చేయనుంది.
కేసులకు సంబంధించిన వివరాలు, సూచనలను 24 గంటల్లోపుగా అదనపు అడ్వొకేట్ జనరల్, గవర్నమెంట్ ప్లీడర్‌కి నివేదించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడంతో పాటూ కోర్టు కేసులు ఎన్నికలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక సెల్ అన్ని జిల్లాలను సమన్వయం చేస్తుంది. అలాగే ప్రతి జిల్లాలో కోర్టు కేసులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని, కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన లీగల్ సెల్‌తో సమన్వయం చేసుకోవాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
దీప్తి శర్మకు జాక్‌పాక్.. రూ. కోట్లు కుమ్మరించిన యూపీ