Share News

TG Govt: సీఎంవోలో అధికారుల శాఖల మార్పు

ABN , Publish Date - May 02 , 2025 | 04:37 AM

సీఎంవోలో అధికారుల శాఖలలో మార్పులు జరిగాయి. శేషాద్రికి వ్యవసాయం, పౌరసరఫరాల బాధ్యతలు, శ్రీనివాసరాజుకు కీలక శాఖలు అప్పగించబడ్డాయి.

TG Govt: సీఎంవోలో అధికారుల శాఖల మార్పు

  • ముఖ్య కార్యదర్శి శేషాద్రికి అదనంగా వ్యవసాయం, పౌరసరఫరాల బాధ్యతలు

  • శ్రీనివాసరాజుకు విద్య, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌.. ‘విద్య’ నుంచి మాణిక్‌ ఔట్‌

  • వేముల శ్రీనివాసులుకు మహిళాశిశు సంక్షేమం సహా మరికొన్ని బాధ్యతలు

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో పని చేస్తున్న అధికారుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల సీఎంవో నుంచి ముగ్గురు అధికారులు బదిలీ కావడం, కొత్తగా సీఎం ముఖ్య కార్యదర్శిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ శ్రీనివాసరాజు నియమితులవడంతో ఆయా శాఖలను సర్దుబాటు చేశారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ శేషాద్రికి ఇప్పటికే ఉన్న శాఖలతోపాటు వ్యవసాయం, పౌరసరఫరాలను అదనంగా అప్పగించారు. ఇప్పటిదాకా విద్య(పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య)తో పాటు మరికొన్ని శాఖల బాధ్యతలను మాణిక్‌రాజ్‌ పర్యవేక్షిస్తుండగా.. విద్యా శాఖ నుంచి ఆయన్ను తప్పించారు. శ్రీనివాసరాజుకు ఆ శాఖతోపాటు ఆర్‌ అండ్‌ బీ, అటవీ, ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనారిటీ సంక్షేమం, హౌసింగ్‌ వంటి కీలక శాఖలను అప్పగించారు. సీఎం ఓస్డీగా ఉన్న వేముల శ్రీనివాసులుకు మహిళాశిశు సంక్షేమం సహా ప్రజావాణి, సీఎంఆర్‌ఎఫ్‌ బాధ్యతలు అప్పజెప్పారు.

  • వి.శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి

సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, హోం, రెవెన్యూ, న్యాయ, ఆర్థిక, పౌరసరఫరాలు, వ్యవసాయం, శాసనసభ వ్యవహారాల శాఖలు, ప్రణాళిక విభాగం, ఓవరాల్‌ ఇన్‌చార్జి ఆఫ్‌ సీఎంవో

Untitled-3 copy.jpg

  • శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి

విద్య, ఆర్‌అండ్‌బీ, రవాణా, హౌసింగ్‌, అటవీ, పర్యావరణం, బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనారిటీల సంక్షేమం, దేవాదాయ శాఖలు

Untitled-3 copy.jpg


  • కె.మాణిక్‌రాజ్‌, సీఎం కార్యదర్శి

మునిసిపల్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ(కమర్షియల్‌ ట్యాక్స్‌, ఎక్సైజ్‌), మైన్స్‌, వైద్యం, విపత్తుల నిర్వహణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

Untitled-3 copy.jpg

  • బి.అజిత్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి

పరిశ్రమలు, విద్యుత్తు, ఐటీ, స్టోర్ట్స్‌, కార్మిక, యువజన వ్యవహారాల శాఖలు, సీఎం భద్రత, అపాయింట్‌మెంట్లు, సీఎంవో నిర్వహణ

Untitled-3 copy.jpg

  • వేముల శ్రీనివాసులు, సీఎం ఓఎస్డీ

మహిళాశిశు సంక్షేమం, సమాచార, పౌరసంబంధాలు, టూరిజం శాఖలు, ప్రజావాణి, సీఎంఆర్‌ఎఫ్‌, సీఎంవోలో కంప్యూటరీకరణ

Untitled-3 copy.jpg

Updated Date - May 02 , 2025 | 04:44 AM