CM Revanth Reddy: 75 ఏళ్ల నిబంధన మోదీకి వర్తించదా?
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:56 AM
ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండినవారు కుర్చీ వదలాలన్న ఆర్‌ఎ్‌సఎస్ నిబంధన మోదీకి వర్తించదా? అని ప్రశ్నించారు.

కుర్చీ వదలాలన్న భాగవత్ మాట పట్టదా?
ఆర్‌ఎ్‌సఎస్ చెప్పినా మోదీ వినడం లేదు
రాహుల్ గాంధీయే ఆయనను దించేస్తారు
ఈసారి బీజేపీకి 150 సీట్లు దాటనివ్వం
తెలంగాణ కులగణన దేశానికే మోడల్
కాంగ్రెస్ న్యాయసదస్సులో సీఎం రేవంత్
న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండినవారు కుర్చీ వదలాలన్న ఆర్‌ఎ్‌సఎస్ నిబంధన మోదీకి వర్తించదా? అని ప్రశ్నించారు. ఆర్‌ఎ్‌సఎస్ మాటను మోదీ వినడంలేదని, వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీయే ఆయనను కుర్చీ నుంచి దించేస్తారని అన్నారు. ఈసారి బీజేపీకి 150 సీట్లు దాటనివ్వబోమని ప్రకటించారు. మోదీని ఓడించేందుకు, ఆయనను కుర్చీ నుంచి దింపేందుకు, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ పోరాడతాయని చెప్పారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ సవాళ్లు: దృక్పథం, మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన కాంగ్రెస్ వార్షిక న్యాయసదస్సులో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘2001లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు కుర్చీని నరేంద్రమోదీ వదలడం లేదు. ఆర్‌ఎ్‌సఎస్ చెప్పినా ఆయన వినడం లేదు. రెండు నెలల క్రితమే ఆర్‌ఎ్‌సఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ 75 ఏళ్లు నిండినవారు కుర్చీ వదలాలని చెప్పారు. అయినా.. మోదీ అందుకు సిద్ధంగా లేరు.
ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషికి వర్తించే నిబంధనలు మోదీకి వర్తించవా? మోదీని కుర్చీ నుంచి ఆర్‌ఎ్‌సఎస్, వాజపేయి దింపలేకపోయారు. వాళ్లతో కానిది మనం చేసి చూపిద్దాం. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీయే మోదీని కుర్చీ నుంచి దింపేస్తారు. మోదీ లేకుంటే బీజేపీకి 150 సీట్లు కూడా రావని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అన్నారు. దూబే నీ డైరీలో రాసి పెట్టుకో. బీజేపీకి 150కి మించి ఒక్క సీటు కూడా రానివ్వం’’ అని రేవంత్ అన్నారు. రాహుల్‌గాంధీ అనుకుంటే 2004లోనే కేంద్ర మంత్రి, 2009లోనే ప్రధానమంత్రి అయ్యేవారని గుర్తు చేశారు. కానీ, ఆ రెండింటినీ ఆయన త్యాగం చేశారని తెలిపారు. త్యాగాలు కాంగ్రె్‌సకు కొత్తేమీ కాదని, సామాన్య కార్యకర్తగానే రాహుల్ కొనసాగుతున్నారని గుర్తుచేశారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల కోసం, సామాజిక న్యాయం కోసం 25 ఏళ్లుగా రాహుల్ గాంధీ పోరాడుతున్నారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందే కాంగ్రెస్ పార్టీ ఉందని, బ్రిటిష్ వాళ్లతో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, ఈ విషయాన్ని బీజేపీ వాళ్లకు గుర్తు చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ మినహా.. బీజేపీ, బీఆర్‌ఎస్, జేడీ, బీజేడీ, ఆర్జేడీ సహా ఇతర పార్టీలన్నీ స్వాతంత్య్రం తర్వాతే వచ్చాయని గుర్తు చేశారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలిస్తే కుర్చీలో, ఓడితే ఇంట్లో కూర్చుంటాయని, కానీ.. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజల మధ్య ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, 11 ఏళ్లుగా సామాజిక న్యాయం గురించి ఆయన ఆలోచించడం లేదని ఆరోపించారు. వక్రమార్గంలో ఉన్న నేతలను రెండు చెంపదెబ్బలు కొట్టయినా దారిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ త్యాగాల పార్టీ..
ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి.. రెండు ముక్కలు చేసి.. కాళీమాతగా గుర్తింపు పొందారని రేవంత్ అన్నారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని ఇందిరాగాంధీ రక్షించారని, ఆ క్రమంలో ఆమె ప్రాణాలనూ త్యాగం చేశారని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో రాజీవ్‌గాంధీ కూడా అమరత్వం పొందారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని పదే పదే బీజేపీ వాళ్లు ప్రశ్నిస్తున్నారని, ఈ దేశం కోసం గాంధీజీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. 2004లో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలని సోనియాగాంధీని అందరూ కోరినా.. ఆమె దానిని త్యాగం చేసి మన్మోహన్‌సింగ్‌ను ప్రధానిని చేశారని తెలిపారు. రాష్ట్రపతిగా అవకాశం వచ్చినా వదులుకొని ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేశారని పేర్కొన్నారు. ఇక దేశంలో సామాజిక న్యాయం, కులగణన కోసం ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు నూతన సామాజిక న్యాయ సాధనకు రాహుల్‌గాంధీ నేతృత్వంలో పోరాడతామని రేవంత్‌రెడ్డి తెలిపారు. భారత్ జోడో యాత్ర సమయంలో తెలంగాణలో కుల గణనపై రాహుల్ ఇచ్చిన హామీ మేరకు తాము కులగణన చేశామని, దేశానికి మోడల్‌గా ఇచ్చామని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News