Share News

Bandi Sanjay KTR Challenge: కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:18 AM

ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేశ్‌ ఎదుట కేటీఆర్‌ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay KTR Challenge: కవితపై కేసులు ఎత్తేస్తే పార్టీని విలీనం చేస్తామన్నారు

  • బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలిపేస్తామన్న కేటీఆర్‌ ప్రతిపాదన నిజమే

  • కేటీఆర్‌కు దమ్ముంటే చర్చకు రావాలి

  • సీఎం రమేశ్‌ను నేను తీసుకొస్తా

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌

సుభాష్‌నగర్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవితపై కేసులు ఎత్తేస్తే.. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం చేస్తామంటూ ఎంపీ సీఎం రమేశ్‌ ఎదుట కేటీఆర్‌ చేసిన ప్రతిపాదన వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. దీనిపై కేటీఆర్‌ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. తాను వేదిక ఏర్పాటు చేసి సీఎం రమేశ్‌ను తీసుకొస్తానని.. తేదీ, సమయం నిర్ణయించి చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ను మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద రూ.23.75 కోట్లతో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. బీసీ డిక్లరేషన్‌ ముసుగులో ముస్లింలకు ఎక్కువ రిజర్వేషన్లను అమలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపన్నుతోందని, ఇది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషన్‌ అని సంజయ్‌ మండిపడ్డారు.


రాష్ట్రంలో బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, వారికి అదనంగా 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆ ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని.. అట్లాంటప్పుడు అది బీసీ డిక్లరేషన్‌ ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ముస్లింలను తొలగించి 42శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అమలు చేస్తేనే, మద్దతు ఇచ్చి, బిల్లు ఆమోదానికి కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్ల కోసమే బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడిని కూల్చివేశారని సంజయ్‌ మండిపడ్డారు. బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రణాళిక ప్రకారం తెలంగాణలో హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోటీ చేయబోతోందని, ఈసారి బీజేపీ అవకాశం ఇద్దామని ప్రజలు ఎదురుచూస్తున్నారని సంజయ్‌ పేర్కొన్నారు.


నేడు సిట్‌ విచారణకు రాలేను..

హైదరాబాద్‌, జులై 27 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ఆపరేషన్‌ సింఽధూర్‌పై చర్చ ఉన్నందున సోమవారం సిట్‌ విచారణకు రాలేనని బండి సంజయ్‌ తెలిపారు. మరో తేదీని త్వరలోనే వెల్లడిస్తానని జూబ్లీహిల్స్‌ ఏసీపీకి లేఖ రాశారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం దిల్‌కుషా గెస్ట్‌హౌ్‌సలో సిట్‌ ఎదుట సంజయ్‌ హాజరు కావాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 03:18 AM