Share News

అక్రమంగా అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:51 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్‌ తమ్ముడు అరుణ్‌కుమార్‌ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది.

అక్రమంగా అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌

  • ఎమ్మెల్సీ కవిత మరిదిపై సంగారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు

పటాన్‌చెరు, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కుమార్‌ తమ్ముడు అరుణ్‌కుమార్‌ గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని సంగారెడ్డి కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు అందింది. సంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి కలెక్టరేట్‌లో ఈ ఫిర్యాదు చేశారు.


పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామం సర్వే నంబర్‌ 213/2లోని బీసీలకు చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన ఐదెకరాల అసైన్డ్‌ భూమిని అరుణ్‌ కుమార్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు. రాత్రికి రాత్రే నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి పట్టా భూములుగా మార్చారని పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2025 | 04:52 AM