ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:21 PM
రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

మంచిర్యాల క్రైం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఽ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ చైర్మన్లు, వైస్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటి చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ పాలకవర్గాలకు సన్మానం
మంచిర్యాల క్రైం/లక్షెట్టిపేట, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పదవికాలం ముగుస్తున్న నేపథ్యంలో మంచిర్యాల, లక్షెట్టిపేట, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నివాసంలో ఆదివారం సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పదవి కాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా రానున్న రోజుల్లో నిరంతరం ప్రజలకు సేవ చేయాలన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పలువురు కార్పొరేటర్లుగా గెలవాలని వారికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, సతీమణి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి కౌన్సిలర్లను పూల మాలలు, శాలువాలతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.