ఆకట్టుకున్న బర్డ్ వాచ్
ABN , Publish Date - Jan 19 , 2025 | 10:23 PM
కవ్వాల టైగర్ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు.

జన్నారం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కవ్వాల టైగర్ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు. విదేశీ పక్షులతోపాటు స్వదేశీ పక్షులు మైసమ్మకుంట, గన్‌శెట్టి కుంట వద్ద కనిపించడంతో ఫొటోలు తీశారు. పలు రకాల పక్షులను వీక్షించడం ఆనందంగా ఉందని పర్యాటకులు తెలిపారు. అటవీ అధికారులు చేపట్టిన పక్షుల సంరక్షణ బాగుందన్నారు. పర్యాకులకు అడవి దున్నలు, జింకలు, దుప్పులు కనిపించడంతో సంబర పడ్డారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వోలు సుష్మారావు, శ్రీనివాస్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
-ఆహ్లాదంగా గడిపాను -శ్యాంసుందర్, వరంగల్
కవ్వాల అభయారణ్యంలో అడుగుపెట్టినప్పటి నుంచి ఆహ్లాదకరంగా ఉంది. రేడియషన్ ఫ్రీ అటవీ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పలు రకాల జంతువులను ప్రత్యక్షంగా వీక్షించాను. అడవి దున్నలు, జింకలు, వివిధ రకాల పక్షులు, నెమళ్లను దగ్గర నుంచి వీక్షించడం ఆనందంగా ఉంది.
-పర్యావరణంపై ప్రేమ ఉండాలి - గిరిధర్‌గౌడ్, హైద్రాబాద్,
ప్రతీ ఒక్కరికి పర్యావరణంపై ప్రేమ ఉండాలి. యాంత్రిక జీవితంలో ఇబ్బందులు, ఒత్తిడిల నుంచి రిలీఫ్ పొందాలంటే అడవుల్లో పర్యటించారు. పక్షులు, అటవీ జంతువులను వీక్షించడం ఆనందంగా ఉంది. ఎప్పుడు చూడని పక్షులను చూడడం సంతోషంగా ఉంది.