Share News

Special trains: 54 ప్రత్యేక రైళ్లు.. అక్టోబరు 15వరకు పొడిగింపు

ABN , Publish Date - Jul 17 , 2025 | 08:56 AM

వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్‌-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్‌-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.

Special trains: 54 ప్రత్యేక రైళ్లు.. అక్టోబరు 15వరకు పొడిగింపు
Indian Railways

హైదరాబాద్‌ సిటీ: వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్‌-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్‌-కన్యాకుమారి(Hyderabad-Kanyakumari) మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌(CPRO Sridhar) తెలిపారు.


city4.3.jpg

ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరికొన్ని మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌-తిరుపతి(Secunderabad-Tirupati) మధ్య 10, కాచిగూడ-నాగర్‌సోల్‌(Kacheguda-Nagarsol) మధ్య 8, నాందేడ్‌-తిరుపతి మధ్య 10, నాందేడ్‌-ధర్మవరం మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సీపీఆర్‌ఓ వెల్లడించారు.


city4.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తాటి చెట్టే లేదు.. లక్షల లీటర్ల కల్లా..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 17 , 2025 | 09:52 AM