Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:07 PM
మాములుగా అయితే ఇన్ స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్‍పై నిషేధం ఉంటుంది. కానీ తాజాగా అనేక మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్‌లో హింసాత్మక వీడియోలు, గ్రాఫిక్ వంటి వాటిని ఎదుర్కొన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదులు చేశారు.

సాధారణంగా ఇన్ స్టాగ్రామ్(Instagram)లో మనం చూసే వీడియోలను బట్టి మనకు వీడియోల ఫీడ్ కంటెంట్ వస్తుంది. కానీ ఇటివల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు మాత్రం ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తమ ఇన్ స్టా ఫీడ్‌లో ఊహించని విధంగా హింసాత్మకమైన, అసభ్య పూరిత కంటెంట్ ప్రత్యక్షమైంది. దీంతో అనేక మంది యూజర్లు హింసాత్మక గ్రాఫిక్, అస్పష్టమైన కంటెంట్ వీడియోలను ఎదుర్కొన్నారు. దీనిపై నిరాశ చెందిన వినియోగదారులు తమ బాధలను వ్యక్తం చేస్తూ X (గతంలో ట్విట్టర్) వేదికగా Instagramపై అసభ్య కంటెంట్ గురించి ఫిర్యాదు చేశారు.
డార్క్ వెబ్‌గా మారిందా..
ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథంలో ఏదో తప్పు జరిగిందని, నాకు చాలా గొడవలు, ప్రమాదాల వంటి వీడియోలు వచ్చాయని ఓ యూజర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాకే లైంగిక వేధింపులు, ఇబ్బందిపెట్టే రీల్స్ కంటెంట్ వచ్చిందా అని మరొక వినియోగదారుడు అన్నారు. ఈ సమయంలో పలువురు మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌ను డార్క్ వెబ్‌తో పోల్చారు. ఇంకో యూజర్ అయితే Instagramకు ఏమైందని ప్రశ్నించారు. మిస్టర్ జుకర్‌బర్గ్ దీనిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. ఇలా సోషల్ మీడియాలో అనేక మంది యూజర్లు తమ నిరాశను వ్యక్తం చేశారు.
క్షమాపణ చెప్పిన ఇన్ స్టా..
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మెటా స్పందించింది. దీనికి సాంకేతిక లోపం కారణమని తెలిపింది. కానీ ఈ అంశంపై మెటా వివరణాత్మక ప్రకటన విడుదల చేయలేదు. ఈ క్రమంలో మా తప్పుకు క్షమాపణలు కోరుతున్నామని మెటా ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో పలువురు వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఫీడ్‌లో సిఫార్సు చేయని కంటెంట్‌ను చూసిన సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు.
అయితే మెటాలో అవయవాలు లేదా కాలిపోయిన శరీరం వంటి సెన్సిటివ్ కంటెంట్‌పై నిషేధం విధిస్తారు. దీంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధం లేదా ఉగ్రవాదం వంటి కంటెంట్ ప్రోత్సహించకుండా నిలిపివేస్తారు. అయితే ఈ సమస్య పరిష్కారమైందని మెటా పేర్కొన్నప్పటికీ, పలువురు యూజర్లు మాత్రం ఇంకా సందేహాస్పదంగానే ఉన్నారు. ఇలాంటి కంటెంట్ నియంత్రణను కఠినతరం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నిరోధించాలని ఇన్‌స్టాగ్రామ్‌ను కోరారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News