Share News

Google: గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్‌ అప్‌డేట్..

ABN , Publish Date - Feb 27 , 2025 | 07:38 PM

గూగుల్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఇకపై మీ వ్యక్తిగత డేటాను ఎప్పుడైనా సులభంగా తొలగించుకోవచ్చని స్పష్టం చేసింది. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Google: గూగుల్ నుంచి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్‌ అప్‌డేట్..
Google new feature

ప్రస్తుతం ఇంటర్నెట్ లేకుండా ఉండగలమా. అంటే కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా తెలియని విషయంపై సమాచారం కోసం వెతకాలన్నా, ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలన్నా, గూగుల్లో(Google) సెర్చ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత యూజర్ల వ్యక్తిగత సమాచారం గూగుల్ తీసుకుంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ తాజాగా సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అదేంటంటే ఇకపై యూజర్ల వ్యక్తిగత వివరాలను ఇంటర్నెట్ నుంచి తొలగించడాన్ని గూగుల్ సులభతరం చేస్తున్నట్లు తెలిపింది.


ఈ క్రమంలో గూగుల్ వినియోగదారుల కోసం ఒక కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వారి వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ ఫలితాల నుంచి తొలగించడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్ నంబర్, ఇమెయిల్, ఇంటి చిరునామా వంటి సున్నితమైన సమాచారాన్ని ఈజీగా తొలగించుకోవచ్చు. ఇది వినియోగదారులకు తమ డేటా ప్రైవసీని కాపాడుకోవడానికి ఒక మంచి అవకాశమని చెప్పవచ్చు.


మీరు దీనిని గూగుల్ సెర్చ్ చేస్తున్న క్రమంలో పక్కన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ చుక్కలపై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు.. నా వ్యక్తిగత సమాచారం, నాకు చట్టపరమైన తొలగింపు అభ్యర్థన ఉంది, నేను రిఫ్రెష్‌ను అభ్యర్థించాలనుకుంటున్నాననే మూడు ఆప్షన్లు వస్తాయి. ఆ క్రమంలో మొదటి ఎంపిక ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించుకోవచ్చు.


గూగుల్ ఈ అభ్యర్థనలను సమీక్షించి, అవసరమైన సమాచారాన్ని తొలగిస్తుంది. రెండో ఎంపిక ద్వారా వినియోగదారులు గూగుల్ విధానాలను ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించమని అభ్యర్థించవచ్చు. చివరి ఎంపిక ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఉన్న పాత సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు తమ డేటా ప్రైవసీని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఈ విధంగా గూగుల్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి, సులభంగా నిర్వహించడానికి కొత్త మార్గాలను అందిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 07:38 PM