Share News

Abu Dhabi T10 League: నేటి నుంచి అబుదాబీ టీ10 లీగ్‌.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?

ABN , Publish Date - Nov 18 , 2025 | 07:31 PM

అబుదాబీలోని షేక్‌ జయేద్‌ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్‌ అబుదాబీ టీ10 లీగ్‌ మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి.

Abu Dhabi T10 League: నేటి నుంచి అబుదాబీ టీ10 లీగ్‌.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?
Abu Dhabi T10 League

నేటి నుంచి (నవంబర్‌ 18) మరో క్రికెట్‌ పండుగ ప్రారంభం కానుంది. అబుదాబీలోని షేక్‌ జయేద్‌ స్టేడియం వేదికగా తొమ్మిదో ఎడిషన్‌ అబుదాబీ టీ10 లీగ్‌(Abu Dhabi T10 League) మొదలు కానుంది. ఈ సీజన్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. అన్ని జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరుగనున్నాయి. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్‌ పూరన్‌ నేతృత్వంలోని డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్‌ పండుగలో ప్రపంచవ్యాప్తంగా ఉండే విధ్వంసకర బ్యాటర్లు పాల్గొనున్నారు. ఈ లీగ్‌లో టీమింయా మాజీ స్టార్లు హర్భజన్‌ సింగ్‌, మురళీ విజయ్‌ లాంటి వారు పాల్గొంటున్నారు.


అబుదాబి T10 లీగ్ 2025 ను టోర్నమెంట్‌ను భారత్‌(T10 League Live Telecast in India)లోని అభిమానులు సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ద్వారా వీక్షించవచ్చు. అలానే ఆన్ లైన్ వీక్షకుల కోసం ఫ్యాన్‌కోడ్‌ యాప్‌, ఫ్యాన్ కోడ్ వెబ్ సైట్ లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది. క్రికెట్ అభిమానులు వారి ప్రాధాన్యతను బట్టి మ్యాచ్ పాస్‌లు , టోర్నమెంట్ పాస్‌ల మధ్య ఎంచుకోవచ్చు. 90 నిమిషాల క్రికెట్ ఫార్మాట్‌ లో జరిగే ఈ లీగ్ కు ఆదరణ బాగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన ఆటల్లో ఒకటిగా నిలిచింది. ఈ లీగ్‌లో అంతర్జాతీయ స్టార్లు, పవర్ హిట్టర్‌లు ఉన్నారు.


అబుదాబీ టీ10 లీగ్‌ 2025 ఫ్రాంచైజీల వివరాలు:

డెక్కన్‌ గ్లాడియేటర్స్‌ (నికోలస్‌ పూరన్‌), అజ్మన్‌ టైటాన్స్‌ (మొయిన్‌ అలీ), అస్పిన్‌ స్టాల్లియన్స్‌ (సామ్‌ బిల్లింగ్స్‌), ఢిల్లీ బుల్స్‌ (రోవ్‌మన్‌ పావెల్‌), నార్త్రన్‌ వారియర్స్‌ (షిమ్రోన్‌ హెట్‌మైర్‌), క్వెట్టా క్వావల్రీ (లియామ్‌ లివింగ్‌స్టోన్‌), రాయల్‌ ఛాంప్స్‌ (జేసన్‌ రాయ్‌), విస్టా రైడర్స్‌ (ఫాఫ్‌ డుప్లెసిస్‌)


ఇవి కూడా చదవండి:

IND VS BAN Women’s Series: భారత్‌-బంగ్లాదేశ్‌ సిరీస్‌‌పై కీలక అప్ డేట్

NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 09:55 PM