Share News

SI Escape: పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:34 PM

ప్రజల సొమ్ముల్ని నెల నెలా జీతాల రూపంలో పుష్కలంగా అందుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ జనాలకే చుక్కలు చూపిస్తున్నారు. నెలకు ఠంచనుగా జీతాలు అందుకుంటూనే లంచాలు ఆశిస్తూ ప్రజలకు ముందు నవ్వులపాలవుతున్నారు.

SI Escape: పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయిన ఎస్ఐ.. మెదక్ జిల్లాలో సంచలన ఘటన
Medak Tekmal SI Escape

టెక్మాల్, (మెదక్) నవంబర్ 18: మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఒక వింతైన ఘటన చోటుచేసుకుంది. సాక్షాత్తూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తన పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోయాడు. ఒక కేసుకు సంబంధించి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజేశ్.. ఏసీబీకి పోలీస్ స్టేషన్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ఏసీబీ అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయాడు రాజేశ్.

SI


దీంతో ఎస్‌ఐ రాజేశ్ ని వెంబడించి, చివరికి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై రాజేశ్.. ఏసీబీకి చిక్కడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు.. పోలీస్ స్టేషన్ ముందు టపాసులు కాల్చారు. SI


ఈ వార్తలు కూడా చదవండి..

అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 07:49 PM