PVN Madhav: నిర్దేశించిన లక్ష్యం కంటే ముందే పూర్తికానున్న ఆపరేషన్ కగార్
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:23 PM
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే ముందుగానే చేరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడ, నవంబర్ 18: దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే ముందుగానే చేరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విజయవాడలో స్పందించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్లు భగ్నం చేసే దిశగా పోలీసులు కదలడంతోపాటు విజయవాడలో మావోయిస్టుల అరెస్టులు అందుకు తార్కాణమని పేర్కొన్నారు.
మావోయిస్టులు మూలాలున్న అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలని పోలీసులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో షెల్టర్ జోన్లుగా మావోయిస్టులు మార్చుకోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన వారితోపాటు సహకారం అందిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
పుట్టపర్తి సత్యసాయి జయంతి ఉత్సవాల్లో సినీనటి ఐశ్వర్య రాయ్, క్రికెట్ దిగ్గజం సచిన్
For More AP News And Telugu News