Ind Vs Aus: ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరంటే?
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:22 PM
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం గబ్బా స్టేడియం వేదికగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ సిరీస్(India vs Australia T20 Series)ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ట్రోఫీ అందుకున్న తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్రకటించారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ఈ మెడల్‌ను సాధించాడు.
ఎంతో ఆనందంగా ఉంది..
టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాజా సుందర్‌కు అవార్డు అందజేశారు. ఆ సందర్భంగా వాషి మాట్లాడాడు. ‘రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని(Impact Player of the Series) అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి రోజూ ఆయన చాలా శ్రమిస్తూ మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం టీమ్ విజయానికి తోడ్పడటం నాకు సంతృప్తినిచ్చింది’ అని సుందర్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉన్న తరుణంలో కీలకమైన మూడో మ్యాచ్‌లో సుందర్ బ్యాట్‌తో సత్తా చాటాడు. 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో మ్యాచ్‌లో 1.2 ఓవర్లే బౌలింగ్ చేసిన సుందర్ మూడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
ధోనీ రికార్డు సమం చేసిన డికాక్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి