Virat Kohli: కోహ్లీకి గులాబీలతో చిన్నారుల ఘనస్వాగతం.. వీడియో వైరల్..
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 PM
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్ జట్టు.. రెండో వన్డే కోసం రాయ్‌పుర్ చేరుకుంది. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి చిన్నారులు గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్(Team India) రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. సోమవారం సాయంత్రం భారత జట్టు రాయ్‌పుర్‌కు చేరుకుంది. టీమిండియా ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి చిన్నారుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. కోహ్లీని చూసి సంబరపడిన పిల్లలు అతని చేతికి ఎర్ర గులాబీలు ఇచ్చి(Virat Kohli Raipur Welcome) ఘనస్వాగతం పలికారు.
విరాట్ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించి నెమ్మదిగా ముందుకు కదిలాడు. కోహ్లీని చూసినప్పుడు పిల్లలు సంబరపడిపోయారు. నక్షత్రాన్ని దగ్గర నుంచి చూస్తే.. ఎలాంటి అనుభూతి వస్తుందో.. పిల్లలకు కూడా కోహ్లీని చూసినప్పుడు అలాంటి అనుభవమే కలిగింది. ఆ విషయం వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఆ చిన్నారులు చూపిన అభిమానంకు కోహ్లీ ఎమోషనలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రాంచీలో భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంట్లో కోహ్లీ(Virat Kohil) విందుకు హాజరయ్యాడు. అనంతరం మరుసటి రోజు రాయ్‌పూర్(Raipur)కు వెళ్లాడు. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ విశ్వరూపం అందరూ చూశారు. 120 బంతుల్లో 135 పరుగులు చేసి.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ విధ్వంసంతో భారత్ 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ చివరి వరకు పోరాడింది. అయితే అతిమంగా భారత్ గెలిచింది. 17 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో కోహ్లీ వన్డేలో 52వ శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ(Rohit Sharma) కూడా అర్ధసెంచరీతో రాణించాడు.
ఇవి కూడా చదవండి:
Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం
Kane Williamson Record: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు