Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం
ABN , Publish Date - Dec 02 , 2025 | 10:14 AM
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఐపీఎల్ కు గుడ్ బై చెప్పి... పాకిస్థాన్ సూపర్ లీగ్ లోకి వెళ్లనున్నట్లు ప్రకటించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్(IPL 2026)కి ముందు మరో ఊహించని పరిణామం ఎదురైంది. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ వేలానికి ముందు ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్(Moeen Ali IPL Retirement,) ప్రకటించాడు. ఇప్పటికే కేకేఆర్ డేంజరెస్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్(Andre Russell) కూడా ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మొయిన్ అలీ కూడా అదే బాటలో వెళ్లాడు. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా రస్సెల్ తో పాటు మొయిన్ అలీని కేకేఆర్ వదిలేసింది. కేకేఆర్ ఫ్రాంచైజీ తనను వదిలించుకోవడం( KKR Releases Players 2026)తో ఐపీఎల్ మొత్తానికే గుడ్‌బై చెప్పేశాడు. తదుపరి సీజన్ వేలంలోనూ తన పేరు కూడా నమోదు చేసుకోలేదు.
కేకేఆర్ వద్దనుకోవడంతో మొయిన్ మనస్థాపం చెందినట్లున్నట్లు సమాచారం. ఐపీఎల్(IPL 2025)లో అతను ఆరు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడి.. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అలానే కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇలా గత సీజన్ లో మొయిన్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో రాబోయే సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోవకూడదని ఫ్రాంచైజీ నిర్ణయించుకుంది. గత ఐపీఎల్ మెగా వేలంలో మొయిన్ అలీని కేకేఆర్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా మరోవైపు మొయిన్ అలీ ఐపీఎల్‌ను కాదని పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈమేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. పీఎస్‌ఎల్ 2026కి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
ఈ ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ ఐదేళ్ల తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఆడనున్నాడు. 2020లో చివరిగా అతను ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తరఫున ఆడాడు. కాగా, ఐపీఎల్ 2026కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ మొయిన్ అలీ, ఆండ్రీ రసెల్‌తో పాటు చాలామంది స్టార్ ఆటగాళ్లను వదిలేసింది. ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన ఆటగాళ్లలో గత సీజన్(IPL 2025) వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధర దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్‌ను సైతం కేకేఆర్ వదిలేసింది. వీరితో పాటు టీ20 స్పెషలిస్ట్‌లు అయిన డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్‌ను కూడా వేలానికి వదిలేసింది.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ విధ్వంసం.. మరో సూపర్ సెంచరీ!
ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్