Junior Hockey World Cup 2025: వరల్డ్ కప్‌లో భారీ విజయంతో భారత్ బోణి
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:34 AM
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ 2025 టోర్నమెంట్ లో భారత్ బోణి కొట్టింది. ఈ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై అద్భుత విజయాన్ని అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో భారత్ జట్టు భారీ విజయంతో బోణి కొట్టింది. జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ(Junior Hockey World Cup 2025)టోర్నమెంట్ లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ తొలి లీగ్ మ్యాచ్‌లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 13–0 గోల్స్ తేడాతో నమీబియా జట్టుపై(India vs Namibia) అద్భుత విజయాన్ని అందుకుంది. ఇండియా తరఫున హీనా బానో (35వ, 35వ, 45వ నిమిషాల్లో), కనిక సివాచ్ (12వ, 30వ, 45వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్ చేశారు. అలానే సాక్షి రాణా (10వ, 23వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.
అలానే సోనమ్ 14వ నిమిషంలో, బినిమా ధన్ 15వ నిమిషంలో, సాక్షి శుక్లా 27వ నిమిషంలో, ఇషిక 36వ నిమిషంలో, మనీషా 60వ నిమిషంలో తలో ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇదే సమయంలో నమీబియాకు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాలేదు. ఇండియా 11 పెనాల్టీ కార్నర్‌లలో ఐదింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మిగత 6 పెనాల్టీ కార్నర్ లో విఫలమైంది. వీటిల్లో కూడా సక్సెస్ అయి ఉంటే.. విజయం అంతరం మరింత భారీగా ఉండేది.
ఇదే టోర్నమెంట్ లో గ్రూప్-సి(Group C Hockey Results)లోని మరో మ్యాచ్‌లో జర్మనీ 7–1తో ఐర్లాండ్‌ను ఓడించింది. రేపు(బుధవారం) జరిగే తన తదుపరి మ్యాచ్‌లో భారత్( India Hockey) జర్మనీతో తలపడనుంది. ఆ తర్వాత గ్రూప్-సి లో శుక్రవారం జరిగే చివరి మ్యాచ్‌లో భారత్... ఐర్లాండ్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
బెంగాల్‌లో ఎస్ఐఆర్ సెగలు.. బీఎల్ఓల ఆందోళన ఉధృతం
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి