Ishan Kishan World Record: ఇషాన్ కిషన్ వరల్డ్ రికార్డు.. తొలి ప్లేయర్‌గా
ABN , Publish Date - Dec 01 , 2025 | 02:45 PM
భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో వరల్డ్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఝార్ఖండ్, త్రిపుర మధ్య జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ సెంచరీ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో వరల్డ్ రికార్డ్(Ishan Kishan world record)ను క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం ఝార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో... టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (41 బంతుల్లో 59), బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42) రాణించారు. ఝార్ఖండ్ బౌలర్లో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్
అనంతరం లక్ష్యఛేదనలో ఝార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) (50 బంతుల్లో 113 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. సెంచరీలో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. మరో బ్యాటర్ విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో కిషన్ కు అండగా నిలిచాడు. సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చరిత్ర సృష్టించిన ఇషాన్..
టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో శతకం ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా ఈ రాంచీ కుర్రాడు నిలిచాడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy) 2018-19 సీజన్‌లో కూడా ఇషాన్ కిషన్ ఝార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.
T20లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
ఇషాన్ కిషన్ (భారత్)- ఝార్ఖండ్ తరఫున 3 సెంచరీలు
ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 సెంచరీలు
మహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 సెంచరీలు.
ఇవి కూడా చదవండి:
Virat Kohli Test comeback: టెస్టుల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ
Virat Kohli: రాంచీ వన్డేలో షాకింగ్ ఘటన.. విరాట్ కాళ్లపై పడిపోయిన అభిమాని