Share News

Tim David Explodes: టిమ్‌ డేవిడ్‌ విధ్వంసం... 30 బంతుల్లో 98 పరుగులు

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:13 PM

అబుదాబీ టీ10 లీగ్‌2025 విజేతగా యూఏఈ బుల్స్‌ (UAE Bulls) నిలిచింది. నిన్న (నవంబర్‌ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్‌ స్టాల్లియన్స్‌పై 80 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ 30 బంతుల్లో 98 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.

Tim David Explodes: టిమ్‌ డేవిడ్‌ విధ్వంసం... 30 బంతుల్లో 98 పరుగులు
Tim David 98 off 30

ఇంటర్నెట్ డెస్క్: అబుదాబీ టీ10 లీగ్‌ (Abu Dhabi T10 League) 2025 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించాడు. 30 బంతుల్లో 98 పరుగులు చేసి.. స్కోర్ బోర్డును జెడ్ స్పీడ్ తో పరిగెత్తించాడు. ఈ అద్భుత ఘన ఆదివారం జరిగింది. నిన్న (నవంబర్‌ 30) జరిగిన ఫైనల్లో ఆస్పిన్‌ స్టాల్లియన్స్‌పై 80 పరుగుల భారీ తేడాతో యూఏఈ బుల్స్‌ ఘన విజయం సాధించింది. దీంతో అబుదాబీ టీ10 లీగ్‌ 2025 ఎడిషన్ విజేతగా యూఏఈ నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 150 పరుగుల ఊహకందని స్కోర్‌ చేసింది.


ఆసీస్ స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ యూఏఈ బుల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్టాల్లియన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన యూఏఈ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ టిమ్‌ డేవిడ్‌ (Tim David) కేవలం 30 బంతుల్లో 12 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 98 పరుగులు చేసి పరుగుల సునామీ సృష్టించాడు. మిగిలిన బ్యాటర్లు రోవ్‌మన్‌ పావెల్‌ 20 బంతుల్లో 24 (నాటౌట్‌), ఫిల్‌ సాల్ట్‌ 8 బంతుల్లో 18 పరుగులు చేశారు.


అనంతరం 151 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్పిన్‌ స్టాల్లియన్స్‌(Ospine Stallions ) ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. నిర్ణీత 10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ రహ్మానుల్లా గుర్బాజ్‌ (15 బంతుల్లో 18) సహా అంతా ఆశించిన మేర ఆడలేదు. ఆండీ ఫ్లెచర్‌ 2 (రిటైర్డ్‌ హర్ట్‌), డు ప్లూయ్‌ 16, కట్టింగ్‌ 11, కరీమ్‌ జనత్‌ 15, సామ్‌ బిల్లింగ్స్‌ 3 పరుగులు మాత్రమే చేశారు. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ డకౌట్‌ అయ్యాుడు. యూఏఈని ఒంటిచేత్తో గెలిపించిన టిమ్‌ డేవిడ్‌(Tim David)కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 9 సీజన్ల ఈ లీగ్‌ చరిత్రలో యూఏఈ బుల్స్‌ విజేత(UAE Bulls champions)గా నిలవడం ఇదే మొదటి సారి.


ఇవి కూడా చదవండి:

Virat Kohli Test comeback: టెస్టుల్లోకి రీఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

Virat Kohli: రాంచీ వన్డేలో షాకింగ్ ఘటన.. విరాట్ కాళ్లపై పడిపోయిన అభిమాని

Updated Date - Dec 01 , 2025 | 12:13 PM