Virat Kohli: రాంచీ వన్డేలో షాకింగ్ ఘటన.. విరాట్ కాళ్లపై పడిపోయిన అభిమాని
ABN , Publish Date - Dec 01 , 2025 | 08:25 AM
రాంచీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డేలో విరాట్ సెంచరీ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని జెఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య తొలి వన్డే( India vs South Africa ODI) జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ అదిరిపోయే సెంచరీ(135)తో తన విశ్వరూపం చూపించాడు. విరాట్ శతకం దెబ్బకు భారత్ 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విరాట్ సెంచరీ(Virat Kohli 52nd ODI century) చేసిన తర్వాత.. ప్రేక్షకులకు అభివాదం చేస్తుండగా.. గ్రౌండ్ లోకి గుర్తు తెలియన వ్యక్తి దూసుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ దుమ్ము లేపారు. రోహిత్(Rohit)(57) అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా విరాట్ కోహ్లీ తన 52వ సెంచరీ నమోదు చేసి దుమ్ము లేపాడు. ఈ మ్యాచ్ లో 120 బంతుల్లో 135 పరుగులు సాధించాడు కోహ్లీ. ఇందులో ఏడు సిక్సర్లు,11 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో కోహ్లీ తన వన్డే క్రికెట్ లో 52 శతకాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ చేసిన నేపథ్యంలో మైదానంలోకి ఓ అభిమాని దూసుకు వచ్చాడు. విరాట్ కోహ్లీ కాళ్ల పైన పడిపోయాడు. దీంతో సెక్యూరిటీ(Ranchi ODI security breach) వెంటనే అతన్ని తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ వ్యక్తి ఎంతో అదృష్టవంతుడని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా.. గ్రౌండ్ లో భద్రతా వైఫల్యం ఉందంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంచీ వన్డే లో కోహ్లీ తన వింటేజ్ బెస్ట్‌ను గుర్తు చేసుకుంటూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సెంచరీతో లెజెండరీ ప్లేయర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డ్(51) బ్రేక్(Sachin Tendulkar record broken) అయింది. కోహ్లీ 52 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. అయితే అన్ని ఫార్మాట్లలో కలిపి శతకాల్లో సచినే అగ్రస్థానంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?