Gayatri Gopichand and Treesa Jolly: గాయత్రి జోడీదే డబుల్స్ ట్రోఫీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:24 AM
భారత డబుల్స్ స్టార్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సొంతగడ్డపై అదరగొట్టింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో...
టైటిల్ నిలబెట్టుకున్న భారత ద్వయం
సయ్యద్ మోదీ ఫైనల్లో శ్రీకాంత్ ఓటమి
లఖ్‌నవూ: భారత డబుల్స్ స్టార్ జోడీ గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ సొంతగడ్డపై అదరగొట్టింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ నిలబెట్టుకొని ఈ వేదికపై తమకు తిరుగులేదని చాటుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ గాయత్రి ద్వయం 17-21, 21-13, 21-15తో జపాన్ జోడీ కహో ఒసావ/మియా తనబెను ఓడించి విజేతగా నిలిచింది. ఇక, పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ప్రపంచ మాజీ నెంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. కిడాంబి ఫైనల్ చేరినా రన్నర్‌పకే పరిమితమయ్యాడు. తుదిపోరులో హాంకాంగ్ షట్లర్ జాసన్ గునవాన్ 21-16, 8-21, 22-20తో శ్రీకాంత్‌పై నెగ్గి టైటిల్ దక్కించుకున్నాడు. శ్రీకాంత్ చివరగా 2017లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాడు.