Share News

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:34 AM

హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ విచారణ చేపట్టింది. సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో ఈ కేసుకు సంబంధించి పలువురిని సీఐడీ ప్రశ్నించింది.

TTD Parakamani Case: పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక
TTD Parakamani Case

తిరుపతి, డిసెంబర్ 1: టీటీడీ పరకామణి కేసు విచారణ ఈరోజుతో (సోమవారం) పూర్తి కానుంది. ఈకేసుకు సంబంధించి డిసెంబర్ 2న నివేదికను సమర్పించాల్సిందిగా హైకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే. దీంతో సీఐడీ అధికారులు రేపు (మంగళవారం) హైకోర్టుకు నివేదికను సమర్పించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసును అక్టోబర్ 27న సీఐడీ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో సీఐడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురిని సీఐడీ అధికారులు విచారించారు.


మొత్తం 35 మందిని విచారించారు. అలాగే ఈ కేసులో ఫిర్యాదుదారుడు సీఐ సతీష్ కుమార్ విచారణకు వెళ్తూ హత్యకు గురవడం మరో సంచలనమనే చెప్పుకోవాలి. చెన్నై, బెంగుళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతిల్లో నిందితుడు రవికుమార్, ఆయనకు సంబంధించిన వారి ఆస్తులను పరిశీలించి, వాటి డాక్యుమెంట్లను సీఐడీ సేకరించింది. గత ప్రభుత్వంలో లోక్ అదాలత్ రాజీ నేపథ్యంలో తిరుపతి రెండవ అదనపు కోర్టు సిబ్బందిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. నేటితో ఈ కేసు విచారణ పూర్తి కానుంది. దీంతో సుమారు 156 పేజీల నివేదికను రేపు హైకోర్టుకు సీఐడీ సమర్పించే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్

ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 01 , 2025 | 12:53 PM