Share News

Nicola Pietrangeli: టెన్నిస్ స్టార్ ప్లేయర్ కన్నుమూత

ABN , Publish Date - Dec 02 , 2025 | 08:43 AM

క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ఇటాలియన్ టెన్నిస్ దిగ్గజం, రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పీట్రాంగెలి(92) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Nicola Pietrangeli: టెన్నిస్ స్టార్ ప్లేయర్ కన్నుమూత

ఇంటర్నెట్ డెస్క్: ఇటాలియన్ టెన్నిస్ క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆ దేశపు అత్యంత గొప్ప టెన్నిస్ దిగ్గజాలలో ఒకరైన, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(Nicola Pietrangeli ) (92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో రోమ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్ పెడరేషన్ ధ్రువీకరించింది. 1933లో ట్యూనిస్‌లో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా, తల్లి రష్యన్ జాతీయురాలు.


పియట్రాంగెలీ ఇటలీ టెన్నిస్( Italian Tennis Legend ) చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఏకైక ఇటలీ టెన్నిస్ ప్లేయర్ నికోలానే కావడం విశేషం​. డేవిస్ కప్ మ్యాచ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా ఆయన పేరిట రికార్డు ఉంది. పియట్రాంగెలీ తన కెరీర్‌లో 44 సింగిల్స్‌ టైటిళ్లను గెలుచుకున్నారు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడు కూడా నికోలానే కావడం గమన్హారం.


1959, 1960లో రెండు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన వార‌స‌త్వాన్ని ప్రస్తుతం జానిక్ సిన్నర్(Jannik Sinner Tribute), మాటియో బెరెట్టినిల వంటి యువ స్టార్ ప్లేయర్లు ముందుకు తీసువెళ్తున్నారు. ఆయన ఇటాలియన్ టెన్నిస్‌కు ఒక ఐకాన్ గా, తర్వాతి తరానికి ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఇక నికోలా పీట్రాంగెలి మృతి పట్ల ఇటలీ ప్రధాన మంత్రి జియోర్జియా మెలోనీ, స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజం రాఫెల్ నాదల్(Rafael Nadal Condolence) సంతాపం వ్యక్తం చేశారు. అలానే వివిధ దేశాలకు చెందిన క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.



ఇవి కూడా చదవండి

unior Hockey World Cup 2025: వరల్డ్ కప్‌లో భారీ విజయంతో భారత్ బోణి

మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Dec 02 , 2025 | 08:43 AM