Harendra Singh Resigns: మహిళల హాకీ చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ రాజీనామా
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:08 AM
భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర.. కోచ్ పదవి నుంచి తప్పుకున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్(Harendra Singh Resigns) తన పదవికి సోమవారం రాజీనామా చేశాడు. ఆయన కోచ్ గా బాధ్యతలు తీసుకున్న 20 నెలలకే ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో హరేంద్ర తప్పుకున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. మహిళల జట్టుకు హరేంద్ర సింగ్ కోచ్ గా ఉండటం ఇది రెండవసారి. గతంలో 2017-18లో కూడా ఉమెన్స్ టీమ్‌కు కోచ్( India Women Hockey Coach)గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. హరేంద్ర కఠినమైన కోచింగ్ నిబంధనల కారణంగా కొంతమంది సీనియర్లకు, అతని మధ్య విభేదాలు ఏర్పడ్డాయని, దీని ఫలితంగా కోచ్ నిర్ణయం తీసుకున్నాడని ఇద్దరు క్రీడాకారుల నుండి విశ్వసనీయంగా తెలిసింది.
హరేంద్ర 2024 నవంబర్‌లో రాజ్‌గిర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ (Asia Cup Hockey 2025)ట్రోఫీలో జట్టును విజయపథంలో నడిపించాడు. కానీ ఫిబ్రవరి నుండి జూన్ వరకు జరిగిన 2024-25 ప్రో లీగ్ లో భారత్ విఫలమైంది. ఈ లీగ్ లో ఇండియా తొమ్మిదవ స్థానంలో నిలిచింది. 2024-25 ఏడాది కాలంలో16 మ్యాచ్ లు ఆడిన భారత్ కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. మూడు డ్రాలు చేసుకోగా 11 ఓడిపోయింది. సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ 2025లో మాత్రం భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఇక హరేంద్ర సింగ్ స్థానంలో సోయెర్డ్ మరైన్(Soyerd Marin Return) (నెదర్లాండ్స్) తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశముంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో అప్పట్లో చీఫ్ కోచ్ గా సోయెర్డ్ మరైన్ కీలకపాత్ర పోషించారు. 2021 ఆగస్టులో మరైన్ చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అమెరికా పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన హరేంద్ర.. 2024 ఏప్రిల్‌లో భారత మహిళల జట్టు శిక్షణ బాధ్యతలు స్వీకరించాడు.
ఇవి కూడా చదవండి
unior Hockey World Cup 2025: వరల్డ్ కప్‌లో భారీ విజయంతో భారత్ బోణి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 49 సెకెన్లలో కనిపెట్టండి