Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:04 PM
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డును బవుమా సొంతం చేసుకున్నాడు.
భారత్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా(South Africa) అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 30 పరుగుల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ప్రొటీస్ జట్టు ఉంది. ఈ మ్యాచ్ గెలుపుతో టెస్టు క్రికెట్ లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నాడు. కోల్ కతా మ్యాచ్ గెలుపుతో బవుమా(South Africa Test Captain Record) ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాక 148 ఏళ్ల టెస్టు చరిత్రలో బవుమా అరుదైన ఫీట్ ను సాధించాడు.
2021 మార్చిలో క్వింటన్ డికాక్ నుంచి దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బవుమా బాధ్యతలు స్వీకరించాడు. తద్వారా సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమితులైన మొదటి నల్లజాతి ఆఫ్రికన్ ప్లేయర్ గా అతడు చరిత్ర సృష్టించాడు. 2022లో ప్రొటీస్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వైట్ బాల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా బవుమా పర్వాలేదనించాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం ఓటమి ఎరుగని నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి(Bavuma Unbeaten Test Captain) కెప్టెన్సీలో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా ఓటమి చెందకపోవడం గమన్హారం.
టెంబా బువుమా కెప్టెన్సీలోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025ను ప్రొటీస్ జట్టు సొంతం చేసుకుంది. 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా గెలుచుకున్న తొలి ఐసీసీ ఇదే. టెంబా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు 11 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో 10 విజయాలు, ఒక్క మ్యాచ్ డ్రా అయింది. తద్వారా 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి 11 టెస్టుల్లో పది విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా బవుమా(Bavuma Unbeaten Test Captain) ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు. కోల్‌కతా మ్యాచ్(India Tour of South Africa) లో రెండో ఇన్నింగ్స్ లో బవుమా ఆట తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. తాను మాత్రం ఏకాగ్రతాను కోల్పోకుండా స్కోరు బోర్డును ముందుకు నడిపించి.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి