SL vs HK : హాంగ్‌కాంగ్‌పై శ్రీలంక ఘన విజయం
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:30 PM
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో పసికూన హాంగ్‌కాంగ్‌పై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్(Asia Cup Rising Stars 2025)లో భాగంగా ఇవాళ (నవంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక-ఏ, హాంగ్‌కాంగ్-ఏ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన హాంగ్‌కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 17 పరుగులకు చేసింది. లంక బౌలర్లలో ట్రవీన్ మాథ్యూ(Travin Mathew) 3 వికెట్లు సాధించాడు. అలానే కెప్టెన్ దునిత్ వెల్లాలగే 2, విజయ్‌కాంత్ వియాస్‌కాంత్ 2, మిలన్ రత్నాయకే 1, గురక సంకేత్1 వికెట్ తీసుకున్నారు.
హాంగ్‌కాంగ్ బ్యాటర్లలో శివ్ మథుర్ (26) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అన్షుమన్ రథ్ (21), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (20), ఎహసాన్ ఖాన్ (17*) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక(Sri Lanka A victory)... ఆడుతూపాడుతూ టార్గెట్ ను ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో(Nuwanidu Fernando) (47*) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి లంకను గెలిపించాడు. ఓపెనర్ నిషాన్ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో శ్రీలంక విజయంలో తన పాత్ర పోషించాడు. విషెన్ హలంబగే 4, లసిత్ క్రూస్‌పుల్లే 13, సహాన్ అరఛ్చిగే 14 పరుగులు చేశారు. హాంగ్‌కాంగ్ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్ తలో వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి