Share News

Telangana Cabinet Meeting: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..

ABN , Publish Date - Nov 17 , 2025 | 06:55 PM

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు.. ఆ తర్వాత..

Telangana Cabinet Meeting: స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్..
Telangana Cabinet Meeting

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని తీర్మానించిన కేబినెట్.. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై డిస్కషన్ నడిచినట్లు సమాచారం.


ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయొద్దని.. వీలైనంత తర్వగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది మంత్రివర్గం. ప్రజాపాలన వారోత్సవాలు ముగిసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డిసెంబర్ 2వ వారంలో గానీ.. 3వ వారంలో గానీ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన దరిమిలా.. అదే ఉత్సాహంతో లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు వెళ్లాలని ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాన్ని ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం తీర్మానించింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసి.. లోక్‌బాడీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ విజయంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.. ప్రజాపాలన వారోత్సవాలతో గ్రామ స్థాయి కేడర్‌లో మరింత ఉత్సాహం నింపి స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నారు.


Also Read:

బైకర్లపై రెచ్చిపోయిన బిహార్ పోలీస్.. వీడియో వైరల్.!

వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్

Updated Date - Nov 17 , 2025 | 07:18 PM